టిఆర్ఎస్ కు షాక్.. వీవీ ప్యాట్ల ఘటనపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

-

హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసిన అనంతరం వివి ప్యాట్ లు తారుమారు కావడం పై తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టిఆర్ఎస్ పార్టీ ఓటమి భయం తోనే.. వివి ప్యాట్ లను తారుమారు చేసిందని ఆరోపణలు చేస్తోంది బిజేపి పార్టీ. అంతే కాదు రాష్ట్ర ఎన్నికల సంఘం చీఎఫ్ శశాంక్ గోయల్.. ఈ మేరకు ఫిర్యాదు చేసింది తెలంగాణ బిజేపి పార్టీ.

ఈ నేపత్యం లోనే హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత వివి ప్యాట్ ల తారుమారు పై వివరణ ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్, హుజురాబాద్ ఆర్వోను ఆదేశించారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం చీఎఫ్ శశాంక్ గోయల్. ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్ల పై ఎన్నికల అధికారుల తో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం చీఎఫ్ శశాంక్ గోయల్.

రేపు అన్ని రాజకీయ పార్టీల నేతలతో సీఈఓ శశాంక్ గోయల్ సమావేశం కానున్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ 2022 క్రింద ఓటర్ల జాబితాలో సవరణలు, తొలగింపులు, మార్పులు, చేర్పుల వంటివి చేసి తుది ఓటరు జాబితా ప్రచురణ పై చర్చ నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news