తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 2 నుంచి తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. అక్టోబర్ 31న ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల్లో పలుచోట్ల వర్షపాతం నమోదైంది. నవంబర్ 2 నుంచి 4 వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఆయా జిల్లాలకు ఆరెంజ్ ప్రమాద హెచ్చిరికలను ఐఎండీ జారీ చేసింది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ (రూరల్), హన్మకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ మరియు కామారెడ్డి జిల్లాల్లో రాగల కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 48 గంటల్లో హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
తమిళనాడు, శ్రీలంకలను అనుకుని అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. ఇది రాబోయే 2-3 రోజులలో అదే ప్రాంతంలో కొనసాగి, ఆ తర్వాత పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంపై ప్రభావం చూపించే అవకాశం ఉందని ఐఎండీ అంచానా వేసింది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి బలంగా గాలులు వీచే అవకాశం ఉంది.