పట్టణ ప్రాంతంలో కూడా టీఆర్ఎస్ కి షాక్…

-

తీవ్ర ఉత్కంఠత నడుమ హుజూారాబాద్ బై ఎలక్షన్ పోలింగ్ జరుగుతోంది. మూడు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ పార్టీ  అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం మూడు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 1269 ఓట్ల ఆధిక్యం సంపాదించింది. కేవలం మూడో రౌండ్ లోనే బీజేపీకి 911 ఓట్లు లభించాయి. కేవలం మొదటి రౌండ్ లో 166 ఓట్లు, రెండో రౌండ్ లో 193 ఓట్లు బీజేపీకి లభించాయి. కేవలం మూడో రౌండ్ లో ఎక్కువ మెజారిటీ లభించింది. కాగా మూడో రౌండ్ లో హుజూరాబాద్ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు జరిగింది. పట్టణ ప్రజలు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. పట్టణ ప్రాంతంలో టీఆర్ఎస్ కు కూడా ఎక్కువ ఓట్లు వస్తాయని భావించినప్పటికీ అంచనాలు తలకిందులయ్యాయి. గ్రామాల్లో, పట్టణ ప్రాంతంలో బీజేపీకే ఎక్కువ ఓట్లు లభించాయి. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో మెజారిటీ టీఆర్ఎస్ కౌన్సిలర్లే అధికారంలో ఉన్నారు. దీంతో మున్సిపాలిటీ పరిధిలో ఎక్కువ ఓట్లు వచ్చి లీడ్ ఎక్కువగా ఉంటుందని టీఆర్ఎస్ భావించింది. అయితే టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్న టీఆర్ఎస్కు లీడ్ తీసుకురాలేకపోయారు. ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపారు.

Read more RELATED
Recommended to you

Latest news