సీఎం కేసీఆర్ నరహంతకుడు…రైతుల ఉసురు తగులుతుంది : రేవంత్ రెడ్డి ఫైర్

-

ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ సర్కార్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. రైతుల ఆత్మహత్యలకు బాధ్యుడు అయినా సిఎం కెసిఆర్ నరహంతకుడు అని.. వరి రైతులకు ఉరి వేస్తున్న కెసిఆర్ నీ శిక్షించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. రైతుల పక్షాన కాంగ్రెస్ ఉంతుందన్నారు. ధాన్యం కొనుగోళ్ల లో టోకెన్ల విధానం ఎక్కడైనా ఉంటుందా..? ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ.. వైన్ షాప్ టెండర్లు మాత్రం పిలుస్తున్నారని మండిపడ్డారు.

కొనుగోలు కేంద్రాలు తెరవలేదు కానీ… వైన్ షాప్ ల టెండర్ లను సర్కారు పిలుస్తోందని ఫైర్ అయ్యారు. రైతుల గురించి ఆలోచన చేయాలని.. కెసిఆర్ పాలన లో దీనికి ప్రాధాన్యత ఉంది అనేది ఆలోచన చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ శాఖామంత్రి బరితెగించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పిల్లి గుడ్డిది అయితే..ఎలుక ఎదురు వచ్చి ఎక్కిరించింది అంటా? అట్లానే టిఆర్ఎస్ పాలన ఉందని ఎద్దేవా చేశారు.

కెసిఆర్ ఏం చెప్పితే అది చేసే వాళ్ళను కలెక్టర్ లు అనడానికి సిగ్గు పడుతున్నామనీ.. కలెక్టర్ లు కెసిఆర్ కి కట్టు బానిసలుగా మారిపోయారని అగ్రహించారు. చివరి గింజ వరకు కొంట అని చెప్పి…ఇప్పుడు కల్లల వద్ద రైతులు ఎదురు చూసే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చలికి వనికి రైతు గుండె ఆగి చనిపోయారని.. రైతు చావుని అవహేళన చేయొద్దని పేర్కొన్నారు. రైతు ఉసురు కెసిఆర్ కి తగులుతుందని హెచ్చరించారు. .

Read more RELATED
Recommended to you

Latest news