పునీత్ సమాధి వద్దే పెళ్లి చేసుకుంటాం.. ప్రేమ జంట సంచలన నిర్ణయం.

-

కన్నడ పవర్ స్టార్ మరణం యావత్ కర్ణాటకనే కాకుండా…దేశాన్ని శోకసంద్రంలోకి ముంచింది. గుండె పోటు కారణంగా చిన్న వయసులోనే తమ అభిమాన హీరోను దూరం చేసిందని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. తన అభిమాన హీరో చివరి చూపు కోసం కంఠీరవ స్టేడియానికి క్యూ కట్టిన సంగతి తెలిసిందే. పునీత్ మరణాన్ని జీర్ణించుకోని కొంతమంది వీరాభిమానులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరోవైపు కంఠీరవ స్టూడియోలో పునీత్ సమాధిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలు వస్తున్నారు.

ఇదిలా ఉంటే బళ్లారికి చెందిన ఓ ప్రేమ జంట పునీత్ సమాధి వద్దే తాము పెళ్లి చేసుకుంటామని సంచలన నిర్ణయం తీసుకుంది. బళ్లారికి చెందిన గురురాజ్, గంగా అనే జంట పునీత్ రాజ్ కుమార్ కు వీరాభిమానులు. శనివారం వీరు పునీత్ సమాధిని సందర్శించారు. రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట పునీత్ సమాధి వద్దే పెళ్లి చేసుకుంటామని ప్రకటించింది. ఇందుకు పునీత్ అన్న శివరాజ్ కుమార్ కూడా ఓకే చెప్పారు. మరోవైపు పునీత్ రాజ్ కుమార్ నేత్రధానం స్పూర్తితో కన్నడ నాట నేత్రధానం చేయడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. మరణించిన తర్వాత కూడా పునీత్ సమాజంలో చైతన్యాన్ని నింపుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news