భారీ వర్షాలు : నీట మునిగిన చెన్నై నగరం

-

చెన్నై నగరాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై నగరం మొత్తం నీట మునిగింది. దీంతో భయంతో వణికిపోతున్నారు చెన్నై వాసులు. చెన్నై మహా నగరాన్ని వరద ముంపు భయం వెంటాడుతోంది. నిన్న రాత్రి నుండి 200 మిమి వర్షపాతం చెన్నై లో నమోదు అయింది. చెన్నైలోని టి నగర్, వెలచ్చేరి, గిండిలో అత్యధిక వర్షపాతం నమోదైంది.

ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి చెన్నై, కన్యాకుమారి , కాంచీపురం, తిరువళ్ళూరు, మధురై, తిరచ్చి,కోయంబత్తూరు సహా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పుయల్, చంబారపాకం డ్యాంలు పూర్తీగా నిండిపోయాయి. దీంతో ఇవాళ మధ్యాహ్నం డ్యాం నుండి నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. వరద ముంపు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చెన్నై కార్పొరేషన్ పరిధిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది స్టాలిన్‌ సర్కార్. అలాగే… సహాయ చర్యలు ఎప్పటికప్పుడు జరగాలని సిఎం స్టాలిన్ అదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news