కామెడీ స్టార్ ఆలీ ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. 1979లో ప్రెసిడెంట్ పేరమ్మ సినిమతో బాలనటుడిగా తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆలీ నటుడిగా, హీరోగా, కమెడియన్ గా అన్ని విభాగాల్లో సక్సెస్ అందుకున్నారు. ఈ సంవత్సరంతో నటుడిగా 40 ఏళ్ల సిని కెరియర్ కంప్లీట్ చేసుకున్న ఆలీని ప్రముఖ సాంస్కృతిక సంస్థ సంగమం ఘనంగా సత్కరించాలని నిర్ణయించుకుంది.
ఈ నెల 23న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆలీ సిని జీవిత మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో ఆలీని స్వర్ణ కంకణంతో సత్కరించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటెండ్ అవుతారని తెలుస్తుంది. ఇక సిని పరిశ్రమకు సంబందించి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, అశ్వనిదత్, తమ్మారెడ్డి భరధ్వాజ్, ఎస్వికృష్ణారెడ్డి వంటి ప్రముఖులు హాజరవుతారని సమాచారం.
ఇకపై రాజకీయాల్లో కూడా ప్రత్యక్షంగా పాల్గొనాలని ఆలీ అనుకుంటున్నట్లుగా సమాచారం. ఇదే విషయమై, ఆయన తెలుగుదేశం నేతలతో, వైసీపీ నాయకులతో కూడా చర్చలు జరిపినట్లు వినికిడి. ఆశ్యర్యకరంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు ఎంతో ఆప్తుడైన ఆలీ, రాజకీయాల విషయంలో మాత్రం పవన్‌ను ఫాలో అవకపోవడం విశేషం.