తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… రిజర్వేషన్లు, వయో పరిమితి పెంచాలని నిర్నయం తీసుకుంది.
టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసే… ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు, గరిష్ట వయోపరిమితిని మరో పదేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. అలాగే.. చెల్లించాల్సిన ఫీజు నుంచి కూడా మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు దివ్యాంగుల సంక్షేమ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. ఇక రిజర్వేషన్లు, గరిష్ట వయోపరిమితిని పెంచడం పై… దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. కొన్ని నెలల క్రితమే… ఉద్యోగాల భర్తీ కోసం.. జోనల్ వ్యవస్థను అమలు లోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ జోనల్ వ్యవస్థ కారణంగా… ఏ జిల్లా కు చెందిన నిరుద్యోగులకు… ఆయా జిల్లాల్లోనే…. ఉద్యోగాలు వస్తాయి. దీంతో వారికీ మంచి… ఉపయోగం ఉంటుంది.