టీ ట్వంటి ప్రపంచ కప్ లో భారత్ పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. కనీసం సెమీస్ కూడా వెళ్లకుండా గ్రూప్ దశలోనే టీమిండియా ఇంటి బాట పట్టింది. దీనికి ప్రధాన కారణం భారత ఆటగాళ్లు నిర్విరామంగా బయోబబుల్ లో ఉండటం వలనే అని చాలా మంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. ఆటగాళ్ల కు బయోబబుల్ నుంచి కాస్త విరామం ఇస్తే టీ ట్వంటి ప్రపంచ కప్ టోర్నమెంట్ లో టీమిండియా ఫార్మమెన్స్ మరోలా ఉండేదని క్రికెట్ విశ్లేషకుల వాదన.
అయితే ఇంగ్లాండ్ టూర్ నుంచి టెస్టు క్రికెట్ ఛాంపియన్ షీప్ తో పాటు ఐపీఎల్ వరకు సుధీర్ఘ కాలం భారత ఆటగాళ్లు బయోబబుల్ లో ఉన్నారు. దీంతో టీ ట్వంటి ప్రపంచ కప్ లో భారత ఆటగాళ్లు విపరీతమైన ఒత్తిడి గురి అయ్యారు. దీని పై ఇప్పటి వరకు ఆటగాళ్ల నుంచి కూడా ఫీర్యాదు లు వచ్చాయి. అయితే దీనికి చెక్ పెట్టడానికి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వరుస గా మ్యాచ్ లు ఆడుతూ.. ఎక్కువ కాలం బయోబబుల్ లో ఉన్న ఆటగాళ్ల ను ఇక నుంచి బీసీసీఐ గుర్తిస్తుంది. వారికి బీసీసీఐ మ్యాచ్ ల నుంచి విరామం ఇస్తుంది. ఈ కీలక నిర్ణయం బీసీసీఐ తీసుకున్నట్టు సమాచారం.