ఎల్బీ నగర్‌ ప్రేమోన్మాది దాడి : నిందితుడికి 14 రోజుల రిమాండ్‌

-

హైదరాబాద్‌ లోని ఎల్బీ నగర్‌ ప్రేమోన్మాది దాడి కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు బస్వరాజ్‌ ను కోర్టు లో ఇవాళ హాజరు పర్చారు ఎల్బీ నగర్‌ పోలీసులు. ఈ సందర్భంగా నిందితుడు బస్వరాజ్‌ కు 14 రోజుల రిమాండ్‌ విధించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. కాగా.. నిన్న యువతిపై బస్వరాజ్‌ కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.

నిన్న సాయంత్రం కత్తిపోట్లతో యువతి మా హాస్పిటల్ లో జాయిన్ అయిందని… జాయిన్ అయినపుడు బీపీ చాలా డౌన్ అయిందని వెల్లడించారు నవీన హాస్పిటల్ డాక్టర్ రవితేజ. అమ్మాయి బాడీ పై మల్టిపుల్ ప్లేసెస్ లో కత్తిపోట్లు ఉన్నాయని… 18 నుండి 20 కత్తిపోట్లు ఉన్నాయన్నారు నవీన హాస్పిటల్ డాక్టర్ రవితేజ.

కడుపు, లంగ్స్ లో డీప్ గా కత్తిపోట్లు ఉన్నాయని… కత్తిపోట్లతో పాటు పిడిగుద్దులు కూడా గుద్దడంతో అమ్మాయి కడుపులో ఇంటర్నల్ గా బ్లీడింగ్ అయిందని చెప్పారు. ఇంటర్నల్ బ్లీడింగ్ తగ్గితే అమ్మాయి పరిస్థితి మెరుగుపడుతుందని… ఇప్పుడు అమ్మాయి స్పృహలోనే ఉందని మీడియాకు చెప్పారు. మరో ఆరు గంటల్లో మరోసారి స్కానింగ్ చేసిన తర్వాత సర్జరీ చేయాలా వద్దా అని నిర్ణయిస్తామని… ఇంటర్నల్ బ్లీడింగ్ కంట్రోల్ చేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news