మీ బేబీ సరిపోయినంత ఫుడ్ తింటుందా లేదో తెలుసుకుంటున్నారా..?

-

చిన్నపిల్లలు ఏదీ నోరు తెరిచి అడగలేరు. అందులోను నవజాత శిశువు ఉన్న తల్లికి అయితే బిడ్డకు ఆకలితీరిందా లేదా అని ఎప్పుడూ ఆందోళన ఉంటూనే ఉంటుంది. ఏడిస్తే పాలివ్వాలని మాత్రం తెలుసు. కానీ మీ బేబీకి సరిపడా ఫుడ్ అందుతుందో లేదో మీకు తెలుసా..ఇది తెలుసుకోవటానికి కొన్ని పద్దతులు ఉన్నాయట. అవేంటంటే…

నవజాత శిశువు ఎంత మేర ఫుడ్‌ తినాలంటే..

రెండు నెలల వరకు..

అప్పుడే పుట్టిన శిశువు నుంచి నెల వరకు 8నుంచి 12 సార్లు ఫీడ్‌ చేయాలి. అంటే ప్రతి రెండు గంటలకు ఒకసారన్నట్లు. బ్రెస్ట్‌ ఫీడింగ్‌ బేబీ ప్రతి గంటన్నరకు ఒకసారి తీసుకోవాలి. అంటే రోజుకు 15 సార్లు. ఒకవేళ తినే సమయానికి బేబీ పడుకుని ఉంటే.. తల్లి కచ్ఛితంగా టైం మానిటర్‌ చేసి.. బేబీని నెమ్మదిగా నిద్రలేపి తినిపించాలి. బిడ్డ పెరిగే కొద్ది.. ఆకలి పెరుగుతూ ఉంటుంది. బ్రెస్ట్‌ ఫీడింగ్‌ బేబీ పాలు కూడా కాస్త ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి ఈ విషయం మీరు గమినించాల్సి ఉంటుంది.

నాలుగు నెలల శిశువు..

బేబీకి నాలుగు నెలలు పడగానే ప్రతి ఫీడ్‌కి నాలుగు ఔన్స్‌ల మిల్క్‌ ఉండేలా చూసుకోవాలి. 20 వారాల తర్వాత వైద్యులు సాలిడ్‌ లేదా థిక్కర్‌ ఫుడ్‌ను సజెస్ట్ ‌చేస్తారు. కొన్ని సందర్భాల్లో బ్రెస్ట్‌ ఫీడింగ్‌ సరిపోతుందంటారు. ఒకవేళ పాలు ఇవ్వడమే కొనసాగిస్తే.. మోతాదు కూడా పెరగాల్సి ఉంటుంది. శిశువు పెరుగుదలలో…పోషణకు కాంప్లిమెంటరీ ఫీడింగ్‌ చాలా ముఖ్యమైన దశలాంటిది.. మీరు మీ బిడ్డను కాంప్లిమెంటరీ ఫీడింగ్‌ను స్టార్ట్‌ చేసినప్పుడు వైద్యుడి సలహా కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.

6 నెలలు..

ఆరు నెలల సమయంలో బేబీకి 8 ఔన్స్‌ల బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ఇవ్వాలి. ఫీడింగ్‌ సమయంలో గ్యాప్‌ కూడా పెరుగుతుంది.
రోజువారీ ప్రాతిపదిక మారుతూ ఉంటుంది. ఉదాహరణకు కొన్నిసార్లు శిశువు సాధారణంగా తినేదాని కంటే ఎక్కువ తినాలనుకోవచ్చు. పెరుగుదల కారణంగా ఇలా జరుగుతుంది. అలాంటి సమయాల్లో మీరు వారు కోరుకున్న పరిమాణంలో తిననివ్వాలి. కానీ, జాగ్రత్తగా ఉండండి, వారి కడుపు నిండిన సంకేతాలు చూడాలి.

కడుపు నిండితే..బిడ్డ బ్రెస్ట్‌ లేదా బాటిల్‌ ఫీడింగ్‌ నుంచి దూరంగా ఉంచుతుంది. సమయానికి బేబీ నిద్ర పోతుంది. బిడ్డ తల ఊగుతూ.. నోరు మూసి ఉంచుతుంది. ఈ సంకేతాలు బట్టి మనం అర్థంచేసుకోవాలి.

వీటితో పాటు మీ డాక్టర్‌తో రెగ్యులర్‌గా చెకప్‌ చేయించడం వల్ల శిశువు ఎదుగుదలను నోట్ చేస్తూ ఉండాలి.. సరైన సమయానికి బిడ్డ ఎదుగుతుంది. బిడ్డ ఎదుగుదలలో తేడా వస్తే ఇంకాస్త శ్రద్ధ చూపించాల్సి ఉంటుదనమాట.!

Read more RELATED
Recommended to you

Latest news