తెలంగాణ ఆర్టీసీ పాలక మండలి నియామకం.. సజ్జనార్‌ కు మరో కీలక పదవి

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ పాలక మండలి బోర్డును నియమించింది ఆర్టీసీ యాజమాన్యం. అయితే ఆర్టీసీ బోర్డు నియామకం లో ఎండి సజ్జనార్ కు కీలక పదవి దక్కింది. తెలంగాణ ఆర్టీసీ పాలక మండలి చైర్మెన్‌ అండ్‌ డైరెక్టర్‌ గా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ గా నియామకం అయ్యారు. అలాగే వైస్‌ చైర్మెన్‌ అండ్‌ డైరెక్టర్‌ గా టీఎస్‌ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ నియామకం కావడం గమనార్హం.

ఇక ఆర్టీసీ బోర్డు లో డైరెక్టర్లుగా రవాణా, రోడ్లు, భవనాల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, ఆర్థికశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, కార్మికశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, కేంద్రప్రభుత్వ ప్రతినిధి, రవాణాశాఖ కమిషనర్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఆర్‌ అండ్‌ బీ), గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌ ఉండనున్నారు. అయితే తెలంగాణ ఆర్టీసీ పాలక మండలి లో కార్మిక సంఘాల ప్రతినిధులకు చోటు కల్పించక పోవడంపై యూనియన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాయి యూనియన్లు.