కామారెడ్డి లో ”జై భీం” తరహాలో లాకప్‌ డెత్.. డీజీపీకి భార్య లేఖ !

-

సూర్య హీరోగా నటించిన జై భీం సినిమా తరహాలోనే.. కామారెడ్డి జిల్లాలో ఓ లాకప్‌ డెత్‌ జరిగింది. నిజామాబాదు లో ముంబే అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడని అతని భార్య ఆరోపణలు చేస్తోంది. రెండు రోజుల క్రితం గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అంతేకాదు…. పేకాట ఆడుతున్న వాళ్లని పోలీసులు చితక్కొట్టారు.

అయితే… పోలీసుల దాడిలో ముంబేకి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో జైలు నుంచి తీసుకెళ్లి…. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే..ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రి లో మృతి చెందారు ముంబే. ముంబే మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా.. పోలీసులు సాకులు చెబుతున్నారు. అయితే.. తన భర్తను పోలీసులు కొట్టడం వల్ల చనిపోయాడని అతని భార్య ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు… భర్త దేహాన్ని అప్పగించాలంటూ తెలంగాణ డీజీపీ కి బార్య రాసింది. అయితే.. దీనిపై డీజీపీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news