కిషన్ రెడ్డితో ఏపీ మంత్రి కీలక సమావేశం

-

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం లో పర్యాటకాభివృద్ధి పై కేంద్ర మంత్రికి ప్రతిపాదనలను సమర్పించారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

సోమశిల ప్రాజెక్టు పరిసరాలతో సహా అనంతసాగరం, సంగం మండలాల్లో పర్యాటక ప్రదేశాలుగా మార్చే అవకాశంగల ప్రాంతాల ను గురించి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి వివరించారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. సోమశిల ప్రాజెక్టు సమీపంలో పురాతన కట్టడాలు, ప్రాచీన చరిత్ర కలిగిన ప్రాంతంగా తీ ర్చిదిద్దాలని వినతి పత్రం అందజేశారు ఏపి మంత్రి. ఇప్పటికే నెల్లూరు జిల్లా పరిధిలో గల పర్యాటక ప్రదేశాల గురించి అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి. “టెంపుల్ టూరిజం” అభివృద్ధికి నెల్లూరు జిల్లాలో అవ కాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర మంత్రికి తెలిపారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news