భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చిక్కుల్లో పడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ( ఏపీ 16 సీఎస్ 1616 ) ఢీకొని ఒక మహిళ మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లా కొలనుకొండ వద్ద రోడ్డు దాటుతున్న మహిళలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రగాయాలైన మహిళను ఆసుపత్రికి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో జీవీఎల్ కారులోనే ఉన్నారు. ప్రమాదం తర్వాత ఆయన మరో కారులో విజయవాడకు వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కారు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు.