నాని కోసం రకుల్..!

-

నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో ఓ సినిమా వస్తుందని తెలిసిందే. రీసెంట్ గా మొదలైన ఈ సినిమాలో నాని సరసన ఐదుగురు భామలు హీరోయిన్స్ గా నటిస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా ఆరెక్స్ 100 హీరో కార్తికేయ నటిస్తున్నాడట. కార్తికేయ కార్ రేసర్ గా ఈ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐటం సాంగ్ కూడా ఉంటుందట.

ఈ స్పెషల్ ఐటం సాంగ్ కోసం క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తో చేయించాలనే ప్లాన్ లో ఉన్నారట చిత్రయూనిట్. ప్రస్తుతం తెలుగులో సరైన అవకాశాలేమి లేని రకుల్ ప్రీత్ సింగ్ కూడా నాని ఐటం గాళ్ గా మారేందుకు సై అన్నదట. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా నాని ఫ్యాన్స్ ను అలరిస్తుందని అంటున్నారు చిత్రయూనిట్. మనం తర్వాత 24, హలో సినిమాలు చేసిన విక్రం కుమార్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news