Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 చాలా రసవత్తరంగా జరుగుతోంది. హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడానికి వీలు లేని విధంగా గేమ్ షో ఉండటంతో చాలా ఎగ్జైటింగ్‌గా బిగ్ బాస్ ను వీక్షిస్తున్నారు. అలాగే.. కంటెస్టెంట్ల వ్యవహర శైలి చాలా విభిన్నంగా ఉంది. ఈ రోజు గొడవపడిన వాళ్లే.. మరుసటి రోజు ఫెండ్స్ గా మారిపోతున్నారు. ఈ రోజు స్నేహంగా ఉన్నవారే.. రేపు బద్ద శత్రువులుగా మారుతున్నారు. ఇదికాక బిగ్ బాస్ ఇస్తున్న చిత్ర విచిత్రమైన టాస్క్‌లు హోస్ మేట్స్ మధ్య గొడవలు సృష్టిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. హౌస్ కు హటెక్కించే విషయం. ఎవరూ ఎవ్వరిని నామినేట్ చేస్తారో ? ఏ కారణంతో నామినేట్ చేస్తారో తెలియదు. 19 మంది మందితో ప్రారంభమైన ఈ షోలో పది మంది ఎలిమినేట్ అయిపోయారు. ఇక, ఇప్పుడు తొమ్మిది మంది సభ్యులు మాత్రమే హౌస్‌లో మిగిలారు.
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి రాబోయే షో లో నామినేషన్ల పర్వం జరుగనున్నది. ఆ నామినేషన్లకు సంబంధించిన వివరాలు నెట్టింట్లో లీక్ అయ్యాయి. లీక్ అయిన సమాచారం ప్రకారం..
ఈ రోజు నామినేషన్ రూల్స్ ప్రకారం.. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుంది. నామినేట్ చేస్తూ.. వారి తలపై స్టైమ్ పోయాలి. అందుకు గల కారణాలు చెప్పాల్సి ఉంటుంది.
మొత్తం మీద ఈ ఎపిసోడ్ ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగేట్టు తెలుస్తుంది.
గతంలో మాదిరిగానే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్దం జరిగినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సన్నీ, షన్ను, యాంకర్ రవి- శ్రీరామ చంద్రలు మధ్య గొడవలు తారా స్థాయికి చేరినట్టు అనిపిస్తుంది. నేటి నామినేషన్లలో ఏకంగా ఎనిమిది మంది నామినేట్ అయినట్టు టాక్. కెప్టెన్ రవి తప్ప మిగితా వాళ్లందరూ
అందరూ.. మానస్, కాజల్, సిరి, ఆనీ, షన్ను, సన్నీ, పింకీ, సింగర్ శ్రీరామ్ లు నామినేషనల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
దాదాపు మొత్తం కంటెస్టెంట్లు నామినేషన్స్ లోకి రావడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ క్రమంలో భారీ ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉన్నవారు.. ఎలాగైనా తప్పించుకున్నారు. కానీ, తక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నా వారు. డేంజర్ జోన్లో పడినట్టే.. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్ ఎవరన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.