ముక్కు నేలకు రాసి… బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి : కేసీఆర్

-

ధాన్యం కొనుగోలు అంశంపై మరోసారి కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పై తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. వరి కొనుగోలు బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని…పేర్కొన్న సీఎం కేసీఆర్‌… పంజాబ్‌లో మొత్తం ధాన్యం కొంటున్నారు.. తెలంగాణ రాష్ట్రం దగ్గర కొనేందుకు నిరాకరిస్తున్నారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

యాసంగి లో వరి వేయమని రైతులకు బండి సంజయ్‌ చెప్పింది నిజమా? కాదా?.. నిజంగా చెప్పి ఉంటే…ముక్కు నేలకు రాసి… మరీ రైతులకు క్షమాపణ చెప్పాలని సవాల్‌ విసిరారు కేసీఆర్. రైతుల పై దాడులు ఏ మాత్రం క్షమించ దగినవి కాదని ఫైర్‌ అయ్యారు. యాసంగి లో వచ్చిన 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదని ఆగ్రహించారు కేసీఆర్.. వచ్చే పంట కొనుగోలు విషయంలోనూ స్పష్టత లేదన్నారు సీఎం కేసీఆర్. ఈ నెల 18 వ తేదీన ఇందిరా పార్క్‌ దగ్గర మహా ధర్నా చేస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news