రైతులు ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? బీజేపీపై కేసీఆర్ ఫైర్.

-

కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ డ్రామాలు చేస్తుందని, రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాడులు చేస్తున్నారని బీజేపీ పార్టీపై తీవ్ర స్వరంతో కేసీఆర్ విమర్శించారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నారని విమర్శించారు. రైతులు ప్రశ్నిస్తే రాళ్లతో, కర్రలతో దాడులు చేస్తున్నారని.. ఈ పద్దతి మంచిది కాదని.. ఖచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. యాసంగిలో వరి వేయాలా వద్దా.. రైతులను యాసంగిలో వరి వేయాలని చెప్పింది నువ్వు కాదా..? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ప్రశ్నించారు. తప్పు చెబితే రైతులకు క్షమాపణలు చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రం ఓ మాట చెబితే.. ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు మరో మాట చెబుతూ రైతులను తప్పు దారి పట్టించేలా చేస్తున్నాడని విమర్శించారు.

వానాకాలం పంటను కొంటామని ప్రభుత్వం చెబుతూ ఉంటే .. మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఏంటని సీఎం బీజేపీని ప్రశ్నించారు. అనవసరంగా రైతులను తప్పు దోవ పట్టించాలని చూస్తున్నారని విమర్శించారు. కోతలే పూర్తి కాక ముందు ధాన్యం కొనుగోలు చేయాలనడం ఏమిటని బీజేపీని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news