మహాారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఎన్ కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నేత మృతదేహాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతదేహం జహల్ నక్సలైట్ నాయకుడు సుఖ్‌లాల్ గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సుఖ్‌లాల్ మరణించినట్టు గడ్చి రోలి పోలీసులు ధ్రువీకరించారు. దండకారణ్య జోనల్ కమిటీ సభ్యుడు సుఖ్‌లాల్‌పై రూ.25 లక్షల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈనెల 13న జరిగిన భారీ ఎన్ కౌంటర్లో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో సీ -60 దళాలకు, మావోయిస్టులకు భీకర ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్లో మరణించిన వారి సంఖ్య ప్రస్తుతం 27 కు చేరింది. మరణించిన వారిలో 6 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకంగా ఉన్న మిళింద్ తేల్తుంబ్డే మరణించారు. ఇతనిపై రూ. 50 లక్షల రివార్డ్ ఉంది. కోర్చి దళ కమాండర్ కిషన్ పై రూ. 8 లక్షల రివార్డ్ ఉంది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు సీ -60 సభ్యులకు గాయాలయ్యాయి.