బ్రేకింగ్ : “ద‌ర్శి” న‌గ‌ర పంచాయ‌తీ టీడీపీ కైవ‌సం

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని మున్సిపల్ ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఈ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే దాదాపు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ లో దూసుకుపోతున్న నేపథ్యంలో… ఎట్టకేలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బోణీ కొట్టింది. ప్రకాశం జిల్లా దర్శి నగరపంచాయతీ ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.

TDP
TDP

దర్శి నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉండగా ఒక వార్డులు ఏకగ్రీవం అయింది. అలాగే ఎన్నికలు జరిగినా 19 స్థానాల్లో ఏకంగా తెలుగుదేశం పార్టీ 12 స్థానాలను కైవసం చేసుకోవడం గమనార్హం. దర్శి లోని 3,4,10,12,13 వార్డు లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అలాగే 14, 15, 17, 18, 19 వార్డు లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక 1,2, 5′ 6′ 7, 9 వార్డులలో వైసిపి అభ్యర్థులు విజయం సాధించారు. ఇక దర్శిని నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కైవసం కావడంతో ఆ పార్టీ నేతల్లో నూతన ఉత్సాహం నెలకొంది. పార్టీ కార్యాలయాల వద్ద.. బాణాసంచా పేలుస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news