చంద్రబాబుకు బిగ్ షాక్ : కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ కైవసం

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. కుప్పం నియోజకవర్గంలో అధికార వైసిపి పార్టీ.. ఏ మాత్రం తగ్గకుండా ఘన విజయం సాధించింది. రెండు స్థానాలు మినహా కుప్పం లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. కుప్పం మున్సిపాలిటీ లో 25 వార్డ్స్ ఉండగా 14 వ వార్డు లలోనూ అధికార వైసీపీ పార్టీ విజయం సాధించింది.

chandrababu naidu ys jagan

తొలి రౌండు లో 14 కి గాను ఏకంగా 12 వార్డు లో విజయం సాధించిన వైయస్సార్ సిపి పార్టీ… రెండో రౌండ్ లోనూ మరో రెండు స్థానాలు కైవసం చేసుకుంది. మొదటి రౌండ్ లో కేవలం రెండు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. మరిన్ని స్థానాల్లోనూ వైయస్సార్ సిపి పార్టీ అధిక్యంలోనే ఉండటం గమనార్హం. ప్రస్తుతం రెండో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ట్రెండ్ ను చూసుకున్నట్లైతే.. కుప్పం మున్సిపాలిటీని వైయస్సార్ సిపి పార్టీ కైవసం చేసుకున్నట్లే మనకు అర్థం అవుతోంది. కాగా కుప్పం లో ఒక వార్డు ఏకగ్రీవం అయింది.