బాబు..ఆ తమ్ముళ్లని చూసి మారండి..లేదంటే కుప్పం అస్సామే!

-

ఎంతసేపు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వైసీపీపై విమర్శలు చేయడం వల్ల తన బలం పెరిగిపోతుందని అనుకుంటే చంద్రబాబు భ్రమలో ఉన్నారని చెప్పొచ్చు. జనంలోకి వెళ్లకుండా…జనం తమ వెంటే ఉంటారని అనుకోవడం మిథ్యే. ఇప్పుడు కుప్పం విషయంలో అదే జరుగుతుంది. కుప్పం అంటే చంద్రబాబు కంచుకోట..అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఆ కంచుకోటని బద్దలగొట్టాలని వైసీపీ ప్రయత్నిస్తూ చాలా వరకు సక్సెస్ అయింది. పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో టీడీపీకి చెక్ పెట్టేసింది. ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీలో టీడీపీని చిత్తుగా ఓడించింది.

chandrababuమరి కంచుకోటలో టీడీపీ ఓటమికి కారణాలు ఏవి అంటే..వైసీపీ అధికార బలంతో గెలిచిందని, దొంగ ఓట్లు, డబ్బులు పంచి గెలిచిందని, దౌర్జన్యాలు చేసి గెలిచిందని చంద్రబాబుతో సహ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. సరే వైసీపీ అధికారం బలం ఉంటే…చంద్రబాబుని అభిమానించే ప్రజలు మారిపోరు కదా…అయినా మారిపోయారు అంటే…బాబు సొంత తప్పిదాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు.

అక్కడ ఎలాగైనా గెలిచేస్తామనే ధీమా బాబుకు ఉంది…అందుకే నియోజకవర్గానికి పెద్దగా వెళ్లరు. స్థానిక నేతలతో బండి లాగించేస్తారు. స్థానిక నేతలు ఏమో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు చేశారో లెక్కలేదు. వారిపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అందుకే 2019 ఎన్నికల్లో బాబుకు మెజారిటీ తగ్గింది. ఆ తర్వాత అయినా బాబు అలెర్ట్ అవ్వాలిగా…లేదు…ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీలో ఓడిపోయేవరకు వచ్చింది. ఈ ఓటమిని కూడా వైసీపీ దౌర్జన్యం ఖాతాలో వేస్తున్నారు.

అలా అనుకుంటే కుప్పంతో పాటు మరికొన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి..కొన్ని చోట్ల టీడీపీ నేతలు గట్టి ఫైట్ ఇచ్చారు. దర్శి, కొండపల్లి మున్సిపాలిటీలని గెలుచుకున్నారు. జగ్గయ్యపేట, ఆకివీడు, దాచేపల్లి, బేతంచెర్ల లాంటి మున్సిపాలిటీల్లో గట్టి పోటీ ఇచ్చారు. కనీసం వాళ్ళు ఇచ్చినట్లు చంద్రబాబు కుప్పంలో పోటీ ఇవ్వలేకపోయారు. అంటే కుప్పంకు, మిగిలిన మున్సిపాలిటీల్లో తేడా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. కాబట్టి ఇకనైనా బాబు క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి పనిచేయాలి..అలా కాకుండా మీడియాలో హడావిడి చేస్తే…ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం..అస్సాం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news