విషాదం : వరదల్లో ఆర్టీసీ బస్సులు… కండక్టర్ తో సహా ముగ్గురు మృతి

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో నిన్నటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే.. కడప జిల్లాలో ఓ విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో ముగ్గురు మరణించారు. కడప జిల్లా రాజం పేట మండలంలో వరద బీభత్సం సృష్టంచింది. రామాపురం దగ్గర చెయ్యేరు నది భారీ వరద తో పోటెత్తింది.

దీంతో రోడ్ల పైకి భారీ వరద నీరు చేరి పోయింది. ఈ తరుణంలోనే రెండు ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కు పోయాయి. పల్లె వెలుగు బస్సు పూర్తి గా… మునిగింది. కండక్టర్‌, ప్రయాణికులు సహా ముగ్గురు మృతి చెందారు. పల్లె వెలుగు బస్సు పై కెక్కి డ్రైవర్‌.. కాపాడాలని కేకలు వేస్తున్నాడు. మరో రెండు బస్సులను వరద నీరు పూర్తి గా ముంచెత్తింది. బస్సుల పై కి ప్రయాణికులు ఎక్కుతున్నారు. అంతేకాదు.. కాపాడాలని ఆర్త నాదాలు చేస్తున్నారు. అయితే.. ఈ విషయం తెలిసిన.. అధికారులు సహాయ చర్యలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news