సాగు చట్టాలు వెనక్కి తీసుకోవడం పై సోనూ సూద్ ఆసక్తికర వ్యాఖ్యలు…!

-

ప్రధాని మోడీ ఈరోజు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా విషయం పై తాజాగా రియల్ హీరో సోనూ సూద్ స్పందించారు. ఇదొక అద్భుతమైన వార్త అని సోనూసూద్ అన్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కృతఙ్ఞతలు తెలిపారు. శాంతియుతమైన నిరసనల ద్వారా న్యాయమైన డిమాండ్లను లేవనెత్తినందుకు రైతులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు. మీ కుటుంబాలతో కలిసి ఉండటానికి ఇళ్లకు వస్తారని ఆశిస్తున్నాం అంటూ రైతులను ఉద్దేశించి సోనూ సూద్ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా సోను తన సేవా కార్యక్రమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆయన కరోనా సమయం లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి రియల్ హీరోగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ సోనూ సోషల్ మీడియా ద్వారా తన సేవా సంస్థ ద్వారా ప్రజలకు సేవ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే సోనుసూద్ రాజకీయ పరమైన అంశాలపై అప్పుడప్పుడు స్పందిస్తుంటారు కానీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా అన్న ప్రశ్నకు మాత్రం ఎంట్రీ ఇవ్వను అనే సమాధానాలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news