హుజూరాబాద్ లో జబ్బలు చరిచి, విర్రవీగి చతికిల పడ్డారని.. కొత్త నాటకం మొదలు పెట్టారని కెసిఆర్ పై ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బియ్యం ఇవ్వాళ కేంద్రం కొత్తగా కొంటుందా… ? అని ప్రశ్నించారు. ముడి బియ్యం కొనేందుకు కేంద్రం సిద్ధమని ప్రకటించారు కిషన్ రెడ్డి. ఈ ఏడు ఏళ్లుగా మేమే కొంటున్నామని చెప్పి .. హుజూరాబాద్ లో ఓటమి తర్వాత కేంద్రం కొంటలేదని అంటున్నారన్నారు. లేని సమస్యను తెర మీదికి తెచ్చారుని.. ఫార్మ్ హౌస్, ప్రగతి భవన్ నుండి ఇందిరా పార్కు మీదకు వచ్చారు… ఆయనకు రైతుల ప్రేమ లేదని మండిపడ్డారు.
నువు చేసే ప్రతి పనికి కూలి కేంద్రం ఇస్తుందని.. కేంద్ర ప్రభుత్వం మీద అబద్దాలు చెబుతున్నారు, విష ప్రచారం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. అబద్ధాల చెప్పడం లో కేసీఆర్ కుటుంబం దిట్ట అని.. కేసీఆర్ ని ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదు… సకల జనుల త్యాగం వల్ల తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. కెసిఆర్ మిలియన్ మార్చ్ లో పాల్గొనలేదు… సాగర హారం లో పాల్గొనలేదు…రైల్ రోకో కి రాలేదు.. కానీ ఈ రోజు లేని సమస్య కోసం ధర్నా కోసం వచ్చారన్నారు. తన పార్టీని రక్షించేందుకు.. హుజూరాబాద్ ప్రజలను అవమానించడం కోసం ధర్నా కు వచ్చారని వెల్లడించారు. మిగులు రాష్ట్రము, ధనిక రాష్ట్రం ఏమైంది… మీరు నివాసం ఉంటున్న మునిసిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. 40 వేల టీచర్ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయని..వాటిని భారతి చేయాలని డిమాండ్ చేశారు.