భారతరాజ్యంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓయూ క్యాంపస్ లో మాక్ అసెంబ్లీని నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఈటెల సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఉపముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నాయకులు పేరాల శేఖర్ రావు వ్యవహరించారు. అంతే కాకుండా గవర్నర్ గా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఈటెల ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతూ….. రాజ్యాంగం సామాన్యులకు కల్పిస్తున్న అవకాశాలను ఈటల వివరించారు.
హుజురాబాద్ ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్నికుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ప్రజలు ధర్మం వైపు నిలబడ్డారని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఈటల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం హుజురాబాద్ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలిచారు. ఇక బీజేపీలో ఆయన సీఎం అభ్యర్థి అంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు మాక్ అసెంబ్లీతో ముందుగానే సీఎం హోదాను అనుభవించారు.