యాసంగి రైతుబంధును తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయాలని నిర్నయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే యాసంగి మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని త్వరగా అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నెలాకరు వరకు నిధులను సర్దుబాటు చేసుకుని వచ్చే నెల మొదటి వారంలోనే రైతుల ఖాతాలో డబ్బులు జమచేయనున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.
గత నెల పండగలు రావడంతో ఆసీజన్ లో వచ్చిన జీఎస్టీ వసూళ్లతో రాష్ట్ర సర్కార్ ఖజానా నిండినట్టు తెలుస్తోంది. దాంతో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులను త్వరలోనే అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన పథకాల్లో రైతుబంధు కూడా ఒకటి ఈ పథకం కింద ఎకరాకు రూ.5వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు ఇస్తున్నారు. పంటకు పెట్టుబడి సాయం కింద ఈ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలోనే జమచేస్తున్నారు. కానీ ఈ పథకం పేద కౌలు రైతులకు వర్తించకపోవడంపై తీవ్రవిమర్శలు కూడా వస్తున్నాయి.