స్టేట్ బ్యాంక్ కి ఆర్బీఐ షాక్…!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తాజాగా పెద్ద షాక్ ఇచ్చింది. అయితే అసలు ఏమైంది అనేది చూస్తే.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ కి భారీగా జరిమానా విధించింది. అయితే దీనికి గల కారణం ఏమిటంటే..?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను అతిక్రమించడం అని క్లియర్ గా తెలుస్తోంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 19లో ఉన్న సబ్‌ సెక్షన్ 2ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉల్లంఘించిన నేపథ్యం లో రిజర్వు బ్యాంక్ జరిమానా విధించినట్టు తెలిపింది.

అయితే ఎస్బీఐ రుణగ్రహీత కంపెనీల్లో పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌లో 30 శాతం కన్నా ఎక్కువ మొత్తం లో షేర్స్ ఉన్నాయని.. ఇలా 30 శాతం కన్నా ఎక్కువ మొత్తంలో షేర్లను కలిగి ఉన్నందుకు ఈ జరిమానా పడిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది.

బ్యాంకులు ఏ కంపెనీలోనైనా తాకట్టుదారుగా, తనఖాగా లేదా సంపూర్ణ యజమానిగా పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌ లో 30 శాతం కన్నా ఎక్కువ మొత్తం లో వాటాలను కలిగి వుండకూడదు అనేది ఆర్‌బీఐ రూల్. కానీ ఈ రూల్ ని స్టేట్ బ్యాంక్ బ్రేక్ చేసింది. దీని మూలంగానే స్టేట్ బ్యాంక్ కి ఆర్‌బీఐ రూ.కోటి జరిమానా విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news