రసవత్తరంగా న్యూజిలాండ్, ఇండియా టెస్ట్.. న్యూజిలాండ్ టార్గెట్ 284 రన్స్

-

ఇండియా, న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా పోరాడనున్నాయి. ప్రస్తుతం మ్యాచ్లో నాలుగు రోజులు పూర్తయ్యాయి. మిగిలిన ఒక్క రోజులో ఖచ్చితంగా ఏదో ఒక ఫలితం వచ్చే అవకాశం ఉంది. నాలుగో రోజు శ్రేయాస్ అయ్యర్, సాహా పోరాటంతో ఇండియా గౌరవప్రదమైన లక్ష్యాన్ని న్యూజీలాండ్ ముందు ఉంచింది. మొదటి ఇన్నింగ్స్ సెంచరీ హీరో శ్రేయాస్ అయ్యర్ 65 పరుగులు చేయగా, వ్రుద్దిమాన్ సాహా 61 పరుగులు చేశారు. ఇండియా 234/7 స్కోర్ వద్ద డిక్లెర్ ప్రకటించారు. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకుని 284 టార్గెట్ ను న్యూజీలాండ్ ముందుంచింది. రెండో ఇన్నింగ్స్ లో సౌథీ, జెమిసన్లు చెరో మూడు వికెట్లు తీశారు.

రెండో ఇన్నింగ్స్ కు దిగిన న్యూజిలాండ్ కు ఆదిలోనే దెబ్బతగిలింది. 4 రన్స్ వద్ద తొలివికెట్ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీతో రాణించిన యంగ్ ను అశ్విన్ ఎల్బీడబ్యూగా పెవిలియన్ కు పంపాడు. ఐదో రోజు మ్యాచ్ గెలవాలంటే ఇండియాకు 9 వికేట్లు, న్యూజీలాండ్ కు280 పరుగులు కావాలి. అయితే ఐదో రోజు ఇండియా స్పిన్నర్లను ఎదుర్కోవడం న్యూజిలాండ్ బ్యాటర్లకు కష్టమనే చెప్పాలి. దీంతో ఐరో రోజు ఆట రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news