కాంగ్రెస్ నిర్వహించిన వరి దీక్షలో రెండో రోజు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వరిధాన్యం కొనుగోలు పై కేసీఆర్ సర్కారుపై మరోసారి ఫైరయ్యారు. రైతులపై కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కల్లాల్లో రైతుల మరణాలన్నీ కేసీఆర్ హత్యలే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ ప్రధానిని కలవకుండా వచ్చారని విమర్శించారు. ధాన్యం పండించడం తెలియన కేటీఆర్, మహమూద్ అలీని ఢిల్లీకి పంపించారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ధర్నా చౌక్ లో ధర్నా… బీజేపీ వరికల్లాల పర్యటన అంతా నాటకాలే అని అన్నారు. నిరసనల పేరుతో కేసీఆర్ కొత్త నాటకాలకు తెర తీశారన్నారు. ఇటీవల కలెక్టర్ రైతును ఉద్దేశించి హెచ్చరికలు చేస్తే.. ఆయనను విధుల్లోంచి తొలగిస్తారని అనుకున్నాని..కానీ ఆయనను పిలిచి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. వరి వేస్తే ఉరే అని అన్నవాళ్లను కేసీఆర్, మోదీలు అందలం ఎక్కిస్తున్నారని విమర్శించారు. ధర్నా చౌక్ ను ఎత్తేసిన కేసీఆర్ అక్కడే ధర్నాకు కూర్చోని దీక్ష చేయడం సిగ్గుగా లేదా..? అని ప్రశ్నించారు. రైతుల పంటలను అంబానీ, అదానీలకు కట్టబెట్టేందుకే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అడుగులు వేస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.
రైతుల మరణాలన్నీ కేసీఆర్ హత్యలే- రేవంత్ రెడ్డి.
-