సీఎం కేసీఆర్ నేడు ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అవలంభిస్తున్న వైఖరిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అంతే కాకుండా సోమవారం నుండి ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యాహం పై కూడా కేసీఆర్ చర్చించి ఎంపీలకే దిశానిర్దేశం చేయనున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర వరి ధాన్య కొనమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గత ఏడేళ్ల నుండి కేంద్రమే కొనుగోలు చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక కేంద్రం వరిధాన్యం కొనుగోలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేస్తుంటే కేంద్రం కొనకుంటే రాష్ట్ర సర్కార్ కొనుగోలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంనే నటి సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.