ఓమిక్రాన్ పుట్టింది మాదేశంలో కాదు.. అయినా శిక్ష అనుభవిస్తున్నాం..

-

ప్రపంచాన్ని ప్రస్తుతం ఓమిక్రాన్ గజగజ వణికిస్తోంది. మరోసారి అన్ని దేశాలు కరోనాపై హై అలెర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ప్రభావిత ప్రాంతాల నుంచి ట్రావెల్ బ్యాన్ విధించాయి పలు దేశాలు. ఇండియా కూడా ఓమిక్రాన్ ప్రభాావిత దేశాల నుంచి రాకపోకలపై నిఘా పెట్టింది. మరోవైపు ఆయా దేశాల నుంచి విమానాలను రద్దు చేయాలని పలు పార్టీలు కోరుతున్నాయి.corona-virus

అయితే ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఓమిక్రాన్ పై కీలక ప్రకటన చేసింది. మా దేశంలో ఓమిక్రాన్ పుట్టలేదని స్పష్టం చేసింది. మొదట ఎక్కడ పుట్టిందో గుర్తించాల్సి ఉందని తెలిపింది. తొందరగా గుర్తించి ప్రపంచ దేశాలను అలెర్ట్ చేశామని దక్షిణాఫ్రికా తెలిపింది. అయితే గుర్తించి పాపానికి మేం శిక్ష అనుభవిస్తున్నాం అని దేశం అంటోంది. ప్రస్తుతం వివిధ దేశాలు దక్షిణాఫ్రికాపై ట్రావెన్ బ్యాన్ విధించాయి. దక్షిణాఫ్రికాతో పాటు బోట్స్వానా, నమీబియా, మొజాంబిక్, జింబాబ్వే, లెసోతో, ఎస్వాటిని, మలావి, జాంబియా మరియు అంగోలా దేశాలపై కూడా ట్రావెల్ బ్యాన్ విధించారు.

కాగా త్వరగా ఓమిక్రాన్ ను గుర్తించి.. స్పందించడంపై యూఎస్, దక్షిణాఫ్రికా దేశాన్ని అభినందించింది.

Read more RELATED
Recommended to you

Latest news