రాజీప‌డేదే లేదు.. ధాన్యం కొనుగోళ్ల పై ప్ర‌శ్నించండి : ఎంపీ ల‌తో సీఎం కేసీఆర్

-

తెలంగాణ రైతుల ప్ర‌యోజ‌నాల విష‌యం లో రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రేప‌టి నుంచి జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల‌లో వ‌రి ధాన్యం కొనుగోళ్ల పై కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని ఎంపీ ల‌కు గులాబీ బాస్ ముఖ్య మంత్రి కేసీఆర్ సూచించాడు. రేప‌టి నుంచి పార్ల‌మెంట్ ఉభ‌య స‌భలు ప్రారంభం అవుతున్న సంద‌ర్భంగా టీఆర్ఎస్ లోక్ స‌భ, రాజ్య స‌భ ఎంపీ ల‌కు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేశాడు.

అలాగే ఈ శీతకాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల పై ఎంపీ ల‌తో చ‌ర్చించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్ర‌భుత్వం పట్టించు కోవ‌డం లేద‌ని.. స‌హాకారం చేయ‌డం లేద‌ని అన్నారు. తెలంగాణ ప్ర‌యోజ‌న విష‌యం లో ఎవరి తోనూ రాజీప‌డబోమ‌ని అన్నారు. తెలంగాణ స‌మ‌స్య ల పై పార్ల‌మెంట్ ఉభయ స‌భ ల‌లో కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని సూచించాడు. అలాగే వరి ధాన్యం విష‌యం లో నూ చాలా ఓపిక ప‌ట్టామ‌ని అన్నారు. ఇక కేంద్రం పై యుద్ధం చేద్దామ‌ని ఎంపీ ల‌కు తెలిపాడు. వ‌రి ధాన్యం విష‌యం లో ఈ పార్ల‌మెంట్ స‌మావేశాల్లో క్లారిటీ తీసుకురావాల‌ని ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news