Bimbisara: “బింబిసారా” టీజర్ రిలీజ్‌..నందమూరి ఫ్యాన్స్ కు ఇక పూనకాలే

-

హిట్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ… దూసుకుపోతున్నాడు నందమూరి కళ్యాణ్‌ రామ్. హీరోగానే కాకుండా… ఓ నిర్మాతగా బాగా సక్సెస్‌ అయ్యారు కళ్యాణ్‌ రామ్‌. అయితే… ప్రస్తుతం టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా ”బింబిసార” అనే సినిమా తెర‌కెక్కిస్తున్నారు కళ్యాణ్ రామ్.ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మిస్తున్నాడు.

పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా అంటూ చిత్రబృందం మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ ను కాసేపటి క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది. ఈ టీజర్‌ లో కళ్యాణ్‌ రామ్ వేరీ పవర్‌ ఫుల్‌ గా కనిపించాడు. తన నటనతో అందరిలోనూ జోష్‌ నింపాడు కళ్యాణ్‌ రామ్‌. ఈ టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news