వైసీపీ కి ఈ మధ్య కాలంలో వరుస షాకులు తగులుతున్న విషయం తెలిసిందే. కార్యకర్తల నుండి మాజీ MLAల వరకు చాలామంది పార్టీని విడి వెళ్లిపోతున్నారు. ఈ మధ్యే బాలినేని శ్రీనివాస్ YCP ని వీడి జనసేనలో చేరగా.. తాజాగా YCP మాజీ MLA సామినేని ఉదయభాను కూడా పార్టీకి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను వైఎస్ జగన్ కు పంపారు ఉదయభాను.
అయితే ఆ రాజీనామా లేఖలో సామినేని ఉదయభాను.. YCP ఆవిర్భావం నుండి నేను పార్టీలో ఉన్నాను. వైఎస్ఆర్, మీకు ముఖ్య అనుచరుడిగా కలిసి నడిచాను. వైఎస్ఆర్ మరణం నాలాంటి వాళ్ళని చీకట్లోకి నెట్టేసింది. వైఎస్ఆర్ ఆశయాలను మీరు కొనసాగిస్తారని నమ్మి మీతో నడిచాను. కానీ ప్రతిసారి నాకు అన్యాయమే జరిగింది.. వైఎస్ఆర్ పై అభిమానంతో అన్ని భరించాను.. చివరికి పార్టీలో నాకు సరైన గుర్తింపు దక్కలేదు.. అవన్నీ నా మనసును కలిచివేశాయి. ఆత్మాభిమానం కాపాడుకోవడం కోసం పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని లేఖలో పేర్కొన్నారు.