టాయిలెట్ వాటర్నే తాగునీరనుకోని 30ఏళ్లుగా వాడేస్తున్న హాస్పటల్.. ఇప్పుడెలా బయటపడిందంటే..!

-

అది తప్పో, పొరపాటో మొత్తానికి జరిగింది. జరిగిన విషయం ఎవరూ గమనించలేదు..30ఏళ్లుగా అలానే కొనసాగింది. ఇంతకీ ఆ తప్పు ఏంటంటే..ఆసుపత్రిలో టాయిలెట్ నీటిని తాగునీరుగా వాడేస్తున్నారుట. అది ఎక్కడో కాదు..శుభ్రతకు మారపేరుగా చెప్పుకునే జపాన్ లోనే.. ఆ ఆసుపత్రిలో డాక్టర్లతో ఎవ్వరూ ఈ విషయం గమనించలేకపోయారు. ఇప్పుడు ఎలా బయటపడిందో, అసలు ఈ దారణం ఇన్ని సంవత్సరాలు సాగిందో చూద్దాం.

ఇప్పుడు ఈ విషయాన్ని జపాన్ న్యూస్ ఔట్‌లెట్ యొమియూరీ షింబన్ తెలిపింది. ఇది ప్రపంచంలోనే ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న న్యూస్ పేపర్. రిపోర్ట్ ప్రకారం… ఒసాకా యూనివర్శిటీకి చెందిన ఆస్పత్రికి నీటిని సరఫరా చేసే ట్యాప్ వాటర్ పైపులు… కొన్ని ప్రాంతాల్లో… సరిగా సెట్ చెయ్యలేదు. దానర్థం… డ్రింకింగ్ వాటర్ పైపులను టాయిలెట్ పైపులకు కనెక్ట్ చేశారని.

ఎప్పుడో 30 ఏళ్ల కిందట ఈ వాటర్ పైపులను తప్పుగా సెట్ చేశారు. 1993లో హాస్పిటల్ ప్రారంభమైంది. మొత్తం 120 ట్యాపులను తప్పుగా సెట్ చేశారననే సంగతి ఇప్పుడు బయటపడింది. ఈ 30 ఏళ్లూ ఆస్పత్రిలో ఉద్యోగులు, పేషెంట్లు అందరూ ఆ టాయిలెట్ నీటినే తాగారు, వాటితోనే బట్టలు ఉతుక్కున్నారు, వాటినే పుక్కిలించారు… ఇలా అన్ని పనులూ చేసుకున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలుసుకొని వారంతా షాక్ అవుుతన్నారు..ఛీ ఛీ అనుకుంటున్నారు. వింటున్న మనకే ఎక్కడే దేవేసినట్లు ఉంది..పాపం ఇక వాళ్ల సంగతి ఐతే దారణమే చెప్పాలి.

ఒసాకా యూనివర్శిటీకి చెందిన ఈ ఆస్పత్రి కొత్తగా మరో ట్రీట్‌మెంట్ కోసం డయాగ్నోసిస్ భవనం నిర్మించాలనుకుంది. దాంతో కొత్త భవనానికి వాటర్ పైపులు ఎలా తేవాలని ఆలోచిస్తూ పరిశీలిస్తే అప్పుడు ఈ తేడా బయటపడింది. హైలెట్ ఏంటంటే ఈ యాజామాన్యం తమ ఆస్పత్రిలో వారానికోసారి నీటిని పరిశీలిస్తామని, రుచి, రంగు, వాసన అన్నీ చెక్ చేస్తున్నామని తెలిపింది. మరి ఇంత చేస్తున్నా 30 ఏళ్లుగా వారికి ఈ విషయం ఎందుకు తెలియలేదో మరి. అయితే వచ్చిన రిపోర్టుల ప్రకారం 2014 నుంచి ఇప్పటివరకూ ఈ నీటిని వాడుతున్నా ఎలాంటి సమస్యా రాలేదని తెలిసింది.

దీనిపై ఆస్పత్రి డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ అయిన కజుహికో నకటానీ ప్రజలకు క్షమాపణ తెలిపారు. ఇప్పటికే ట్రీటెమెంట్ చేయించుకున్న వేల మందికి ఆస్పత్రి సిబ్బందిని క్షమాపణ కోరారు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news