వరణుడు ఏపీని వదిలేలా లేడు. గత నెల కాలం నుంచి వరసగా వాయుగుండాలు, అల్పపీడనాలతో ఏపీ ప్రజలు అల్లాడుతున్నారు. ఒకదాని వెనక మరోటి అల్పపీడనాలు ఏర్పడుతుండటంతో ఏపీకి కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే గత వారం ఏర్పడిన అల్పపీడనం రాయలసీయ జిల్లాలను తీవ్రంగా నష్టపరిచాయి. భారీ స్థాయిలో వరదలు సంభవించి పలు ఊళ్లను ముంచెత్తాయి. ఈవిపత్తులో పెద్ద ఎత్తున ఆస్థి, ప్రాణ నష్టాలు వాటిల్లాయి.
తాజాగా ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. తుఫాన్ ముప్పు ఉత్తరాంధ్రను వణికిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ, ఒడిశా తీరం వైపు దూసుకోస్తుంది. ఇది రేపు వాయుగుండం, ఎల్లుండి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫానుగా బలపడితే దానికి ’జవాద్‘ గా పేరు పెట్టనున్నారు. తుఫానుగా మారితే ఈనెల 5,6 తేదీల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతాావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.