గురుద్వారాలో ఫోటో షూట్ పై భారత్ ఆగ్రహం.. పాక్ హైకమిషనర్ కు సమన్లు

-

పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాలో మోడల్ ఫోటో షూట్ వ్యవహరం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే స్థలంలో మోడల్ ఫోటో షూట్ చేయడంతో వివాదం మొదలైంది. ఇటీవల కర్తార్ పూర్ సాహిబ్ లో మోడల్ మోడల్‌ సులేహా ఇంతియాజ్‌ తలపై వస్త్రం కప్పుకోకుండా ఫొటోషూట్‌లో పాల్గొనడాన్ని భారత్‌ ఆక్షేపించింది. దీనిపై సిక్కు మతస్థుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేఖత వచ్చింది. గురుద్వారా పవిత్రతకు భంగం కలిగించేలా సులేహా చర్యలు ఉన్నాయని సిక్కులు ఆరోపించారు. తమ మనోభావానలు ఈ చర్య దెబ్బతీసిందని ప్రపంచ వ్యాప్తంగా సిక్కులు వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారంలో భారత్ ఆగ్రహంగా ఉంది. దిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌లో ఆ దేశ తాత్కాలిక రాయబారికి ఈ వ్యవహారంలో మంగళవారం సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారంలో నిజాయతీతో దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

కాగా ఈ వ్యవహారంపై మోడల్ సులేహా స్పందించింది. సిక్కుల మనోభావాలు దెబ్బతీయడానికి నేను అలా చేయలేదని ఆమె పేర్కొంది. తన ఫోటో షూట్ పై పాక్ మోడల్ సులేహా క్షమాపణలు కోరింది. గురుద్వారాలో దిగిన ఫోటోలను తన ఇన్ స్టా అకౌంట్ నుంచి డిలీట్ చేసినట్లు తెలిపింది. మళ్లీ ఇలాంటి తప్పు చేయనని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news