జబర్దస్త్ యాంకర్, సినీనటి అనసూయ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. యాంకర్ అనసూయ తండ్రి సుదర్శన్ రావు మరణించారు. హైదరాబాద్ తార్నాకలోని ఆయన సొంత నివాసంలో మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ఉదయం నుంచి తీవ్ర అస్వస్థతకు లోనైన సుదర్శన్ రావు.. కాసేపటి క్రితమే మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.
సుదర్శన్ రావు చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీ లో పని చేశారు. అలాగే సామాజిక సేవలోనూ సుదర్శన్రావు చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. అయితే తండ్రి సుదర్శన్రావు మరణించడంతో… యాంకర్ అనసూయ ఫ్యామిలీ విషాదంలోకి వెళ్ళింది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అయితే.. సుదర్శన్ రావు ఎలా మరణించారనే దాని పై ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై మరికాసేపట్లోనే వివరాలు తెలియాల్సి ఉంది.