తెలంగాణ ప్రజలకు వార్నింగ్ ఇచ్చింది వైద్య ఆరోగ్య శాఖ. జనవరి 15 నుంచి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి ఫిబ్రవరిలో పీక్ స్టేజీకి చేరే అవకాశం ఉందని హెచ్చరించింది వైద్య ఆరోగ్య శాఖ. ఈ తరుణంలో వ్యాక్సిన్ తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని.. ఓమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని సూచనలు చేసింది. ఓమిక్రాన్ వైరస్ సోకిన వారికి లక్షణాలు ఉండటం లేదని.. వీరికి ఎలాంటి సమస్య ఉండదని పేర్కొంది. కానీ ఇతరులకు చాలా ప్రమాదకరమని.. హెచ్చరించింది.
హైదరాబాద్ లో రేపో మాపో కొత్త వేరియంట్ వచ్చే ప్రమాదం ఉందని.. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని వివరించింది వైద్య ఆరోగ్య శాఖ. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రాణాలు తీసే గుణం ఒమిక్రాన్ లో లేదని నిపుణులు చెబుతున్నారని తెలిపింది. థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు వైద్య శాఖ సిద్ధంగా ఉందని.. 3 లక్షల మంది నిన్న ఒక్కరోజే వ్యాక్సిన్ వేసుకున్నారని వెల్లడించింది. వ్యాక్సిన్ పై అవగాహన పెరిగిందని అభిప్రాయపడింది.