న్యూజిలాండ్ లో ముంబైలో జరుగుతున్న చివరిదైన రెండో టెస్ట్ లో దాదాపుగా ఇండియా విజయం ఖరారైంది. టెస్ట్ సిరీస్ లో పాటు, మ్యాచ్ గెలుపుకు మరో 5 వికేట్ల దూరంలో ఇండియా నిలిచింది. మరో రెండు రోజులు ఆట కొనసాగనుండటంతో నాలుగో రోజే న్యూజిలాండ్ ఆల్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా.. అద్భుతం జరిగితే తప్పితే..ఇండియా గెలుపును ఆపలేరు. ప్రస్తుతం న్యూజీలాండ్ స్కోరు..140/5 గా ఉంది. న్యూజిలాండ్ మ్యాచ్ గెలవాలంటే మరో 400 పరుగులు చేయాల్సి ఉంది. ఇండియా గెలవాలంటే 5 వికేట్లు తీయాలి.
మూడో రోజు భారత బ్యాటర్లు ధాటిగా ఆడి రెండో ఇన్నింగ్స్ ను 276/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని 540 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజీలాండ్ ముందు పెట్టింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ బ్యాటర్లు అశ్విన్ స్పిన్ ధాటికి విలవిల్లాడారు. మొదట ఇన్నింగ్స్ లో 4 వికేట్లు తీసిన.. అశ్విన్, రెండో ఇన్నింగ్స్ లో మరో మూడు వికేట్లు తీశారు. ప్రస్తుతం నికోల్స్ 36 పరుగులతో, రచిన్ రవీంద్ర 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు న్యూజిలాండ్ బ్యాటర్లు ఏ మాత్రం పోరాడుతారో చూడాలి.
స్కోర్ వివరాలు–
ఇండియా తొలి ఇన్నింగ్స్ — 325/10, రెండో ఇన్నింగ్స్ – 276/7 డిక్లెర్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్– 62/10, రెండో ఇన్నింగ్స్ – 140/5