ఏపీ రైతుల‌కు బిగ్ షాక్‌.. వ‌రి వేయ‌ద్ద‌ని జ‌గ‌న్ ఆదేశాలు !

-

ఇవాళ వ్యవసాయ అనుబంధ రంగాల పై సీఎం జగన్ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ… ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన, సాగు చేసేవారికి తగిన తోడ్పాటు అందించాలన్నారు. బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుఅయ్యేలా రైతుల్లో అవగాహనకల్పించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జ‌గ‌న్‌.

ప్రత్యామ్నాయ పంటల వల్ల రైతులకు మంచి ఆదాయం వచ్చేలా చూడాలని… వరి పండిస్తే… వచ్చే ఆదాయం మిల్లెట్స్‌ పండిస్తే కూడా వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. దీనికోసం రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని… ఈ అంశంపై సరైన అధ్యయనం చేసి రైతులకు అండగా నిలవాలని తెలిపారు. మిల్లెట్స్‌ పండించినా రైతులకు మంచి ఆదాయం వచ్చే విధానాలు ఉండాలని… మిల్లెట్స్‌ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని వెల్ల‌డించారు సీఎం జ‌గ‌న్‌. మిల్లెట్స్‌ను అధికంగా సాగుచేస్తున్న ప్రాంతాల్లో ప్రాససింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని… దీంతోపాటు సహజ పద్ధతుల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలన్నారు  జ‌గ‌న్ .

Read more RELATED
Recommended to you

Latest news