నాసిర‌కం ఎరువులు, విత్త‌నాలు అమ్మితే క‌ఠిన చ‌ర్య‌లు : ఏపీ సీఎం జ‌గ‌న్

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో రైతుల‌కు నాసిర‌కం విత్త‌నాలు, ఎరువులు విక్ర‌యిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. నాసిరకం ఎరువులు, పురుగు మందులు, విత్త‌నాలు ఎవ‌రూ అమ్మినా.. రెండు సంవ‌త్సరాల పాటు జైలు శిక్ష విధించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. రైతులు కూడా వ‌రి కి ప్ర‌త్యామ్నాయ పంట లు వేయాల‌ని పిలుపు నిచ్చారు. అలాగే రైతులు విత్త‌నాల విష‌యం లో మోస పోవ‌ద్ద‌ని తెలిపారు.

విత్త‌నాలు, ఎరువులు, పురుగు మందుల విష‌యం లో ఎలాంటి అనుమానాలు ఉన్నా.. ప్ర‌భుత్వ అధికారుల‌ను సంప్ర‌దించాల‌ని సూచించాడు. ప్ర‌తి ఏడాది కంటే ఈ ఏడాది సాగు లో లాభాలు ఎక్కువ గా రావాల‌ని అన్నారు. అందు కు అనుగూణంగా సంబంధిత అధికారులు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అలాగే రైతుల‌కు ఆర్గానిక్ వ్య‌వ‌సాయానికి ప్రాధాన్య‌త ఇచ్చే విధంగా అధికారులు రైతుల‌ను ప్రొత్స‌హించాల‌ని సూచించారు. అలాగే సేంద్రియ వ్య‌వ‌సాయానికి అవ‌స‌రం అయిన ప‌రిక‌రాల‌ను, మందుల‌ను రైతులకు అందుబాటు లో ఉంచాల‌ని అధికారుల‌ను ఆదేశించాడు.

Read more RELATED
Recommended to you

Latest news