55 దేశాలు 13 వందలకు పైగ కేసులు … ప్రపంచ దేశాల్లో ఓమిక్రాన్ విజృంభన

-

ప్రపంచ దేశాలను ఓమిక్రాన్ వేరియంట్ కరోనా భయపెడుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య, నమోదవుతున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. అత్యంత వేగంగా ప్రపంచ దేశాలకు ఓమిక్రాన్ పాకుతోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ వేరియంట్ అనతి కాలంలోనే పలు దేశాలకు విస్తరించింది. కట్టడి చేయాడానికి ఓమిక్రాన్ ప్రభావిత దేశాలపై ఇతర దేశాలు ట్రావెల్ బ్యాన్ విధించినా.. ఈ వేరియంట్ విస్తరణకు అడ్డకట్ట వేయలేకపోతున్నాయి. కొన్ని దేశాలు విదేశీయులకు తమ బోర్డర్స్ క్లోజ్ చేసినా.. కేసులు నమోదవడం గమనార్హం.

తాజాగా ప్రపంచంలోని 55 దేశాలకు ఓమిక్రాన్ విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే 1347 కేసులు నమోదయ్యయి. యూకేలో 336, డెన్మార్క్ లో 261, దక్షిణాఫ్రికాలో 228, జింబాబ్వేలో 50, యూఎస్ లో 40, ఇండియాలో 23 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న దేశాలతో పాటు కొత్తగా మరికొన్ని దేశాలకు కూడా ఓమిక్రాన్ వేరియంట్ సోకే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news