ఫ్యాక్ట్ చెక్: ఉత్తరాఖండ్ లో పాఠశాల పైకప్పు విరిగిపోగతే.. గుజరాత్ అంటూ వైరల్ … అసలేం అయ్యిందంటే..?

-

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలకి అంతే లేకుండా పోతోంది. ఏదో ఒక నకిలీ వార్త పుట్టుకొస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక పాఠశాలకు సంబంధించిన వార్త వైరల్ గా మారింది. ఈ పాఠశాల పై కప్పు విరిగిపోయిందని.. గుజరాత్ స్కూల్లో ఈ సంఘటన జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ని కూడా పెట్టి సోషల్ మీడియాలో దానిని వైరల్ గా మార్చారు.

పైగా ట్విట్టర్ లో ఆ ఫోటోని పోస్ట్ చేసి దాని మీద గుజరాత్ ప్రభుత్వం కొత్తగా సోలార్ పవర్ స్కూల్ ని మొదలు పెట్టిందని మోదీకి కృతజ్ఞతలు అని రాసి ఉంది. అయితే ఈ ఫోటోలో నిజమెంత అనేది చూస్తే… ఈ ఫోటో గుజరాత్ గవర్నమెంట్ కి సంబంధించినది కాదని.. అల్మోరా ఉత్తరాఖండ్ లోనిది అని తెలుస్తోంది.

ఉత్తరాఖండ్ లో ఆ స్కూల్ పైకప్పు పడిపోయిందని తెలుస్తోంది అయితే తల్లిదండ్రులు ఆ స్కూల్ పనిచేయాలని చెప్పినప్పటికీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదు మార్చి 12, 2018 లోనిది. అప్పటి ఫోటోని తీసుకువచ్చి ఇప్పుడు ప్రధాని ఫోటోతో పాటు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇది ఫేక్ వార్త అని స్పష్టంగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news