జగన్ సర్కార్ కు కేంద్రం మరో షాక్.. రైల్వేజోన్ పై మొండిచెయ్యి !

-

ఏపీకి కేంద్రం మరోసారి మొండిచెయ్యి చూపింది. ఏపీ విభజన చట్టం లోని రైల్వేజోన్ హామీకి తిలోదకాలు ఇచ్చిన కేంద్రం.. వైజాగ్ కేంద్రంగా రైల్వేజోన్ పై వైఖరిని స్పష్టం చేసింది. దేశంలో ఇక కొత్త రైల్వే జోన్ లను ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది కేంద్రం. బిజెపి ఎంపి అజయ్ నిషాద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు.

దేశంలో ప్రస్తుతం 17 రైల్వే జోన్ లు ఉన్నాయని వెల్లడించిన కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విశీ వైష్ణవ్.. వైజాగ్ రైల్వేజోన్ అంశాన్ని ప్రస్తావించలేదు. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు మరిన్ని జోన్ లను ప్రకటించే ఉద్దేశం లేదని ప్రకటించారు అశ్వినీ వైష్ణవ్. రైల్వేజోన్ సాధ్యాసాధ్యాలపై గతంలో ఓ ఎస్ డిని నియమించి చేతులు దులుపుకుంది కేంద్రం.

రైల్వే జోన్ పై కేంద్రానికి ఓ ఎస్ డి నివేదిక ఇచ్చింది. అయితే ఓఎస్ డి నివేదికపై ఎటూ తేల్చలేదు కేంద్రం. ఇక ఏపీలో రైల్వే జోన్ అసాధ్యమంటున్నారు రైల్వేశాఖ అధికారులు. రైల్వేజోన్ అంశంపై కేంద్రం వద్ద ఇప్పటి వరకూ ప్రస్తావించలేదు జగన్ ప్రభుత్వం.. జగన్ ప్రభుత్వం అచేతనం కారణంగానే ఏపీ రైల్వే జోన్ ను కేంద్రం పక్కన పెట్టిందంటున్నారు రైల్వేశాఖ సీనియర్ అధికారులు

Read more RELATED
Recommended to you

Latest news