ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ ఈరోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక నిన్న తగ్గిన కరోనా మహమ్మారి కేసులు ఇవాళ కాస్త పెరిగిపోయాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 193 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి. అటు కరోనా కారణంగా.. కృష్ణ, శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
గడచిన 24 గంటల్లో 164 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటలలో…31, 101 కరోనా పరీక్షలను నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ. దీంతో ఇప్పటి వరకు..3,06,82,613 కరోనా పరీక్షలు చేసింది ఆరోగ్యశాఖ. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 14,460 మంది కరోనా కారణంగా మరణించారు. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2037 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా మహమ్మారి కేసుల సంఖ్య..20744410 కి చేరుకుంది.
#COVIDUpdates: 09/12/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,71,515 పాజిటివ్ కేసు లకు గాను
*20,55,018 మంది డిశ్చార్జ్ కాగా
*14,460 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,037#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/uYyMp0IFlQ— ArogyaAndhra (@ArogyaAndhra) December 9, 2021