కళ్యాణ్ రామ్ ‘118’ ఫస్ట్ రివ్యూ & రేటింగ్

-

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ డైరక్షన్ లో మహేష్ ఎస్ కోనేరు నిర్మించిన సినిమా 118. ఈరోజు ప్రేక్షకుల ముందుకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గౌతం (కళ్యాణ్ రాం)కు కలలో ఓ అమ్మాయిని ఎవరో దుండగులు దాడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. లేచి చూస్తే అది కల అని తెలుసుకుంటాడు. మళ్లీ 6 నెల తర్వాత అదే కల వస్తుంది. అయితే ఆ కల గురించి తెలుసుకునే క్రమంలో ఆ కలలో వచ్చే లొకేషన్ కనిపెడతాడు గౌతం. అక్కడ నుండి కలలో తనని వెంటాడుతున్న అమ్మాయి గురించి వేట మొదలు పెడతాడు. ఇంతకీ గౌతం కలలో వచ్చేది ఎవరు..? ఆమెతో గౌతం కు ఉన్న రిలేషన్ ఏంటి..? 118 ఈ కథకు సంబంధం ఏంటి అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే :

కథలుగా విని సూపర్ అనుకున్న ప్రతిది సినిమాగా సక్సెస్ అవలేదు. కథ ఎంత బాగుందో అదే విధంగా సినిమాను తెరకెక్కించాలి. గుహన్ రాసుకున్న లూసిడ్ డ్రీమింగ్ కాన్సెప్ట్ బాగుంది. హీరో 118 రూమలో పడుకోవడం అక్కడ ఓ అమ్మాయి కలలోకి రావడం ఆమె గురించి వెతకడం బాగుంది. అయితే ఫ్లాష్ బ్యాక్ లోకి వచ్చాక సినిమా పట్టు తప్పింది.

ఫస్ట్ హాఫ్ మొత్తం వేగంగా నడిపించగా సెకండ్ హాఫ్ మళ్లీ ట్రాక్ తప్పినట్టు తెలుస్తుంది. సినిమాను ఆడియెన్స్ కు ఎంగేజ్ చేయడంలో దర్శకుడు మరింత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే బాగుండేది. కొన్ని సీన్స్ మాత్రం బాగున్నాయి. ఓవరాల్ గా డిఫరెంట్ జానర్ మూవీస్ చూసేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా వచ్చింది. అయితే స్క్రీన్ ప్లే ఇంకా బాగా రాసుకుని ఉంటే బాగుండేది. నందమూరి ఫ్యాన్స్ వెరైటీ సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

ఎలా చేశారు :

సినిమా సినిమాకు కళ్యాణ్ రాం కూడా బాగా షైన్ అవుతున్నాడు. గౌతం పాత్రలో అతని నటన ఆకట్టుకుంది. కొన్ని సీన్స్ లో బాగా చేశాడు. ఇక షాలిని పాండే హీరో లవర్ గా జస్ట్ ఓకే అనిపిస్తుంది. సినిమాలో మెయిన్ రోల్ నివేదా థామస్ చేసింది. సినిమా మొత్తం ఆమెని వెతకడం చుట్టే తిరుగుతుంది. బాగా చేయగలితే స్కోప్ ఉన్నా దర్శకుడు పెద్దగా రాబట్టుకోలేదు. నాజర్, ప్రభాస్ శ్రీను, రాజీవ్ కనకలా చేసిన పాత్రల్లో మెప్పించారు. విలన్ కేవలం 3 సీన్స్ కే పరిమితమవుతాడు.

కెవి గుహన్ తన సినిమాకు తానే సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. దర్శకుడిగా ఆయన ఇంకా బాగా వర్క్ చేయాల్సిందే. ఎంచుకున్న కథను పర్ఫెక్ట్ గా తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్, బిజిఎం అలరించింది.

ప్లస్ పాయింట్స్ :

కళ్యాణ్ రాం, నివేదా థామస్

కెమెరా మెన్ వర్క్

ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ ఫ్లాష్ బ్యాక్

స్క్రీన్ ప్లే

మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

బాటం లైన్ :

కళ్యాణ్ రాం 118.. ప్రయత్నం మంచిదే కాని..!

రేటింగ్ : 2.5/5

Read more RELATED
Recommended to you

Latest news