మహర్షి ఉరుకులు.. పరుగులు..!

6

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు భాగమై నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలకు మహేష్ కు ఓ పెద్ద ఫైట్ జరుగుతుందని తెలుస్తుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ చేయాల్సింది చాలా ఉందట. అయితే ఏప్రిల్ 25న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. మే నెలకు వాయిదా వేద్దామని అనుకుంటుంటే మహేష్ బ్యాడ్ సెంటిమెంట్ వల్ల వద్దని చెబుతున్నాడట. ఇప్పటి నుండి రెగ్యులర్ షూట్ చేస్తే ఏప్రిల్ 10 వరకు షూటింగ్ జరపాల్సి ఉందట. అది కూడా ఒకరోజు కూడా మిస్ అవ్వకుండా ఉంటేనే కుదురుందట. అంటే మిగతా 15 రోజుల్లో రిలీజ్ చేయాలి. మరి ఇదంతా కుదిరే పనేనా అనంటున్నారు కొందరు. త్వర త్వరగా కానిస్తే సినిమా ఫీల్ దెబ్బతింటే అసలకే మోసం వచ్చినా వస్తుంది. మరి మహర్షి టీం ఏం చేస్తుందో చూడాలి.

amazon ad